శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని ఎన్ఏసీ (NAC) భవనం రెండో అంతస్తులో సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగాల కోసం ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయ గదులను సీఎంసీ కమిషనర్ సృజన ప్రారంభించారు. పరిపాలనా కార్యకలాపాలు మరింత సజావుగా సాగేందుకు, ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త కార్యాలయ సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త ఏర్పాట్లతో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరు మరింత సమన్వయంతో కొనసాగనుందని అన్నారు. ఇకపై ఈ విభాగాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఎన్ఏసీ మాదాపూర్ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో సేవల అందజేతలో పారదర్శకత, వేగం, ప్రజలకు అందుబాటు మరింత మెరుగుపడే అవకాశం ఉందన్నారు.






