మియాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ గా జి.శ్రీనివాస్…

శేరిలింగంప‌ల్లి, జూన్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మియాపూర్ సర్కిల్ (48) ఉప కమిషనర్ గా జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఉప కమిషనర్ శశిరేఖ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారి స్థానంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా సంబంధాల అధికారి(PRO)గా విధులు నిర్వహిస్తున్న బదిలీపై రానున్నారు. జి శ్రీనివాస్ గతంలో జిహెచ్ఎంసి జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహించారు.

మియాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ జి శ్రీనివాస్

ఆ తర్వాత మిర్యాలగూడ మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేశారు. ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇక్కడికి బదిలీపై వచ్చారు. సిఎంసి పీఆర్వో గా విధులు నిర్వహిస్తున్న జి శ్రీనివాస్ ను మియాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ గా బదిలీ చేస్తూ కమిషనర్ సృజన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శశిరేఖ నుండి ఆయన ఛార్జ్ తీసుకొనున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here