శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శేరిలింగంపల్లి ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. మలేషియా పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా కలిసి ఆయనకు చిర్రా రవీందర్ యాదవ్ మొక్కను బహుమతిగా అందించారు. శేరిలింగంపల్లిలోని తాజా రాజకీయాలపై కేటీఆర్ తో చిర్రా రవీందర్ యాదవ్ సుధీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. మారిన రాజకీయ పరిస్థితులను సైతం కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్ లలోని పార్టీ సమస్యలను సైతం కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో భారాస పార్టీకి తిరుగులేదని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. కేటీఆర్ మార్గదర్శకంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని గెలిపించుకొని తీరుతామని చెప్పారు. మరోవైపు అన్ని డివిజన్ లలోనూ భారాస జెండాను ఎగరవేస్తామంటూ చిర్రా రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.






