శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన, అభివృద్ధి ప్రయాణాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో నిర్వహించిన మేధావుల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను బేగంపేట్ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేధావుల సమ్మేళనం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, దేశ అభివృద్ధి, సుశాసనం, ప్రజా సంక్షేమం అంశాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన మేధావులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.






