శేరిలింగంపల్లి, జూన్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర నూతన డీజీపీగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ని మాజీ ఎమ్మెల్యే మారబోయిన భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి ఇంచార్జ్ ఎం. రవికుమార్ యాదవ్ సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీవీ ఆనంద్ పోలీసు విభాగంలో ఎన్నో సేవలను అందించారని, ఆయన డీజీపీగా నియామకం అవడం హర్షణీయమని అన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఆయన ఇలాగే సేవలు అందించాలని ఆశిస్తున్నామని తెలిపారు.






