శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీలలో రూ.75 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ హామీద్ పటేల్, జలమండలి అధికారులు, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీల్లో కొనసాగుతున్న యూజీడీ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. యూజీడీ నిర్మాణం పూర్తయిన అనంతరం వెంటనే రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. పనుల అమలులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు కాలనీ వాసుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఏ చిన్న సమస్యనైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జలమండలి ఈడీ మండల సంతోష్ రెడ్డి, డీజీఎం శ్రీహరి, మేనేజర్ సందీప్, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్, నాయకులు తిరుపతి, రజనీకాంత్, అక్షయ్, శారద, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





