శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విత్ యాక్షన్ నాలెడ్జ్ (స్పీక్) ఆధ్వర్యంలో ఇటీవల నియమితులైన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సన్మాన కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ విశ్వేశ్వర భవన్లో నిర్వహించారు. స్పీక్ చీఫ్ అడ్వైజర్ అన్నే సత్యనారాయణ, ఆహ్వాన కమిటీ చైర్మన్ అట్టేపల్లి రామ ప్రభు, ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మురళికుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీక్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ గోపాలం విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్పొరేషన్లకు నూతనంగా నియమితులైన చైర్మన్లైన గూడూరు శ్రీనివాస్ (పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్), సీహెచ్ బాలరాజు (తెలంగాణ భట్రాజ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్), చరణ్ కౌశిక్ యాదవ్ (తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ), డాక్టర్ దాసరి రాజు అజయ్ కుమార్ (వాషర్మెన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్), దొంగరి వెంకటేశ్వర్లు (పెరిక కో-ఆపరేటివ్ కార్పొరేషన్), సంఘ వెంకట్రాజం (మేర కో-ఆపరేటివ్ కార్పొరేషన్), బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి (మున్నూరు కాపు కో-ఆపరేటివ్ కార్పొరేషన్), ఎం. రఘునాథ్ యాదవ్ (యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్), గుంజ రేణుక నారాయణ (వడ్డెర కో-ఆపరేటివ్ కార్పొరేషన్), దూదేం వెంకటరమణ (తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్), బండి రమేష్ (కమ్మ కార్పొరేషన్)లను సన్మానించారు.

అదేవిధంగా వైస్ చైర్మన్లైన పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ (బ్రాహ్మిణ్ సంక్షేమ పరిషత్), బుడగం శ్రీనివాస్ (పెరిక కో-ఆపరేటివ్ కార్పొరేషన్), ఎం. లక్ష్మీనారాయణ (మేర కో-ఆపరేటివ్ కార్పొరేషన్), వాల్మీకి బోయ నగేష్, అల్లం భాస్కర్ (మున్నూరు కాపు కో-ఆపరేటివ్ కార్పొరేషన్), గజ్జి భాస్కర్ యాదవ్ (యాదవ్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్), బత్తుల వెంకటేష్ (వడ్డెర కో-ఆపరేటివ్ కార్పొరేషన్), జక్కారి అనిత (తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్), పరుచూరి మురళి (కమ్మ కార్పొరేషన్)లను కూడా సత్కరించారు. ఈ సందర్భంగా స్పీక్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ గోపాలం విద్యాసాగర్ మాట్లాడుతూ భవిష్యత్తులో సామాజిక, రాజకీయ చైతన్యానికి దోహదపడే అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆహ్వాన కమిటీ చైర్మన్ అట్టేపల్లి రామ ప్రభు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు, వైస్ చైర్మన్లను సన్మానించడం ఆనందదాయకమని అన్నారు. వారు తమ తమ సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన చైర్మన్లు, వైస్ చైర్మన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్పీక్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.





