శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదినం సందర్భంగా బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతున్ని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యాధికారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలియజేయాలని బీసీ కులాల తరఫున విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (ఆర్టీసీ) ఉద్యోగి నాయకుడు, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉద్యోగి జె. జంగయ్య యాదవ్, రాజు గౌడ్, కృష్ణ ముదిరాజ్, నాయి బ్రాహ్మణ అశోక్, రజక సంఘం నాయకుడు కిషోర్‌తోపాటు వివిధ బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. వారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.





