ఎన్నికల సందేహాల నివృత్తికి మియాపూర్ సర్కిల్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు

శేరిలింగంప‌ల్లి, మే 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్నికల సంబంధిత సందేహాలను నివృత్తి చేసి సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ శశిరేఖ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ డెస్క్ ద్వారా ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటరు నమోదు, వివరాల మార్పులు తదితర ఎన్నికల ప్రక్రియలకు సంబంధించిన సమాచారం, మార్గదర్శకత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఎన్నికల సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులు కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here