శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గోపన్పల్లి తండాకు చెందిన నేనావత్ హనుమంతు నాయక్ బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా బంజారా సమితి ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ హనుమంతు నాయక్ గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తూ, ఎస్టీలకు సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా పనిచేయాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీలు, సంక్షేమ పథకాలు గిరిజనులకు సమర్థంగా చేరేలా కృషి చేయాలని సూచించారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, కే నరసింహ యాదవ్, యువజన నాయకుడు డీజే భవన్, కాలనీ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేనావత్ హనుమంతు నాయక్ మాట్లాడుతూ ఎస్టీల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం గిరిజనులకు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్ష పదవి అప్పగించిన బీజేపీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






