శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఆడపిల్లలకు చిన్నవయస్సులో పెళ్లి చేయడం వలన తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరమని, బిడ్డ బలహీనంగా పుట్టడం, చదువు ఆగిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం జరుగుతుందని శేరిలింగంపల్లి ICDS ప్రాజెక్ట్ ఆదిత్యనగర్ సెక్టార్ సూపర్ వైజర్ ఠాకూర్ కోమలబాయి అన్నారు. ఆదిత్యనగర్ సెక్టార్ పరిధిలోని మౌలాలీ అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో వార్డు ఆఫీస్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండని పక్షంలో పెళ్లిళ్లు చేయరాదని, బాల్య వివాహం జరిగితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా కాలనీ పెద్దలు, పూజారులు, టెంట్ హౌజ్ ఓనర్లు, ఇమామ్ సాహెబ్ లకు అవగాహన కల్పించి, ఇటువంటివి జరిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆమెగారి, నారాయణమ్మ, ప్రశాంతి, కె. లక్ష్మి, కాలనీ వాసులు పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు.






