శేరిలింగంపల్లిలో వీధి ఆహార విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ శిక్షణ.. 110 మందికి సర్టిఫికేషన్..

శేరిలింగంప‌ల్లి, మే 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోన్‌లో వీధి ఆహార విక్రేతలకు ఆహార భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ నారాయన్ అమిత్, అదనపు కమిషనర్ (UBD) సుభద్రదేవి, ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006 నిబంధనల ప్రకారం నిర్వహించిన FSTC (Food Safety Training and Certification) కార్యక్రమంలో వీధి ఆహార విక్రేతలకు సురక్షిత ఆహార నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో మొత్తం 110 మంది వీధి ఆహార విక్రేతలు పాల్గొని Food Safety Supervisor కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి హైజీన్ కిట్లు కూడా పంపిణీ చేశారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని Nestlé India, National Association of Street Vendors of India సహకారంతో నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here