శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): నీట్ పేపర్ లీక్పై న్యాయం కోరుతూ BRSV ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడికి వెళ్లిన విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఆరాచక పాలనకు నిదర్శనమని శేరిలింగంపల్లి నియోజకవర్గం విద్యార్థి నాయకుడు, బిఆర్ఎస్వి రాజు వడ్డెరాజ్ ధ్వజమెత్తారు. ప్రశ్నించిన విద్యార్థుల గొంతు నొక్కడం, ఇష్టానుసారంగా తిట్టుతూ కొడుతూ ACP మురళీ కృష్ణ వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. నీట్ లీక్పై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం నిరసన తెలిపిన విద్యార్థులపై దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు.






