శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ రామకృష్ణ నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర భక్తి శ్రద్ధల మధ్య కొనసాగింది. ఈ కార్యక్రమానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శోభాయాత్రలో పాల్గొన్న ఆరెకపూడి గాంధీ భక్తులతో కలిసి హనుమాన్ స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కాలనీ ప్రాంతాన్ని మార్మోగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, లక్ష్మారెడ్డి, ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తుల ఉత్సాహం, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య శోభాయాత్ర విజయవంతంగా కొనసాగింది.






