శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం శేరిలింగంపల్లిలోని ఆదర్శ్‌నగర్‌లో సభ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటిసారి తెలంగాణకు రాబోతున్నారని, ఈ సభను జయప్రదం చేయాలని అన్నారు. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రవీందర్, రవీందర్ రెడ్డి, రమేష్ చౌదరి, శ్రీకాంత్, నారాయణ చౌదరి, శ్రీనివాస్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.






