రామప్రభు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

శేరిలింగంప‌ల్లి, మే 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో రెండు ప్రదేశాలలో గురునాథం చెరువు వద్ద, అంగారా రెస్టారెంట్ ఎదురుగా చలివేంద్రాల‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు శీతల పానీయాలుగా మజ్జిగ, రాగి జావల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి పురుషోత్తం, గంగాధర్, రఘునందన్ రెడ్డి, వినోద్, సుధీర్ కుమార్, మోహన్, ఉదయ్, బాబ్జీ, గిరి, వెంకటేశ్వర్లు, దయాకర్, సోమేశ్వర్, సాంబయ్య, రాజు , రవి, సుప్రజ, లక్ష్మయ్య, శ్రీరాములు, కాంతయ్య, కృష్ణమూర్తి, కాజా తదితరులు, ARP టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here