శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ మెయిన్ రోడ్డులో నాయకుడు తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీసీసీ అధ్యక్షుడు, చైర్మన్ చల్లా నరసింహా రెడ్డి, ఓబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు, శ్రామిక శక్తి అవార్డు గ్రహీత నల్ల సంజీవ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డినేటర్ రఘునందన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, నాయకుడు వీరేందర్ గౌడ్, ఇతర నాయకులతో కలిసి ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభం అనేది సేవాభావాన్ని ప్రతిబింబించే గొప్ప కార్యక్రమం అని చల్లా నరసింహా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు రాంచందర్ యాదవ్, ఇలియాస్ షరీఫ్, రాంప్రభు, రాంచందర్ గౌడ్, సౌందర్య రాజన్, రవి కుమార్, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, వెంకన్న, శ్రీహరి గౌడ్, కృష్ణ, నరేందర్ ముదిరాజ్, శేఖర్, బ్లాక్ అధ్యక్షులు శ్రీదేవి, సంగీత గౌడ్, శాంత తదితరులు పాల్గొన్నారు.






