శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ భేటీ అయ్యారు. శేరిలింగంపల్లిలోని తాజా రాజకీయాలపై సుధీర్గంగా చర్చించారు. పార్టీ కార్యక్రమల అమలు తీరును కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా చిర్రా రవీందర్ యాదవ్ ను కేటీఆర్ అభినదించారు. అనంతరం కేటీఆర్ కి చిర్రా రవీందర్ యాదవ్ తిరుపతి శ్రీవారి ప్రసాదంను అందించారు. అలాగే ప్రతిభ కనబరించిన పలువురు విద్యార్థులను కేటీఆర్ తో కలిసి చిర్రా రవీందర్ యాదవ్ సన్మానించారు.






