శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ లోని 8వ బెటాలియన్ పాఠశాలలో ప్రోగ్రెస్ కార్డ్స్ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, మండల విద్యాధికారి వెంకటయ్య, కాంగ్రెస్ వార్డు మెంబర్ రక్తపు జంగం గౌడ్, ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు ప్రియ, విజయ, కుసుమ, రజిత, గీత, ప్రియాంక, మౌనిక పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.






