శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా నాయకులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మంగు భాయ్, శ్రీకాంత్ తెలిపారు. రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని TRP నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి పరిధిలోని పలు పాఠశాలల వద్దకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు పాంప్లెట్లు పంచుతూ, RTE చట్టం గురించి వివరించారు.

పేద విద్యార్థుల హక్కుల కోసం ఈ చట్టం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు. విద్యా హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా అందాలని, RTE చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలను డిమాండ్ చేశారు.





