శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్టర్ పండుగను ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా జరుపుకున్నారని సీఐ ప్రశాంత్ తెలిపారు. మియాపూర్లోని కల్వరి టెంపుల్ లో 3వ ఈస్టర్ సేవలను నిర్వహించారని, ఈ సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. అలాగే 4వ సేవ కూడా మొదలైందని తెలిపారు. మొత్తం 1.70 లక్షల మంది ఈస్టర్ ప్రార్థనల్లో పాల్గొన్నారని వివరించారు. ఈ సందర్బంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ రద్దీ లేకుండా చూసేందుకు మొత్తం 101 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని ఉపయోగించామని తెలిపారు, వారిలో హోమ్ గార్డు నుంచి ఏసీపీ స్థాయి అధికారుల వరకు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భగా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సదుపాయం కల్పించామని, టూవీలర్లు, ఫోర్ వీలర్లను నిర్దిష్టమైన ప్రదేశాల్లో పార్కింగ్ చేసేలా చూశామని తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రార్థనలు ముగిశాయని పేర్కొన్నారు.






