శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న హిందూ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మియాపూర్‌లోని గురునాథ్ చెరువు వద్ద హిందూ సమ్మేళ సమితి ఆధ్వర్యంలో వాకింగ్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఐక్యత, అంకితభావం, సాంస్కృతిక విలువల పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించారు. రాబోయే ఆత్మీయ సమ్మేళనానికి ఇది ఒక శక్తివంతమైన ముందడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో యలమంచి ఉదయ్ కిరణ్, మోహన్ ముదిరాజ్, గంగాధర్, రామప్రభు, నడిమింటి కృష్ణ, అమర్, కేశవరావు, నేతాజీ, పురుషోత్తం, రమేష్, నాని, లోకేష్, హర్షిత్, కాలనీ వాసులు, హిందూ సమ్మేళనం నిర్వాహకులు పాల్గొన్నారు.

సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం, సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించడం వంటి లక్ష్యాలతో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వాలంటీర్లు, నిర్వాహకులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 19న జరగనున్న హిందూ ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.





