సీఎం రిలీఫ్ ఫండ్ పేద‌ల‌కు గొప్ప వ‌రం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీకి చెందిన కృష్ణ శ్రీ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.3 లక్షల ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here