ఘ‌నంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 35వ వార్షిక బ్రహ్మోత్సవం

శేరిలింగంప‌ల్లి, మార్చి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ‌స్థానంలో జరిగిన శ్రీమదలర్మేల్ మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల 35వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా జరిగిన రథోత్సవం కార్యక్రమంలో భాగంగా పుర వీధుల గుండా శ్రీ వార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని, వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి వారి కృప‌ ప్రజలందరిపై ఉంటుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, నాయి నేనీ చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కృష్ణంరాజు, పోతుల రాజేందర్, కాశినాథ్ యాదవ్, చాట్ల రవి, అల్లం మహేష్, అమర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here