ప్రత్యేక చొరవతో భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మార్చి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ సాయి ఎన్‌క్లేవ్ కాలనీలో నూతనంగా చేపట్టిన భూగర్భ డ్రైనేజీ లైన్ (UGD) నిర్మాణం పనులను జలమండలి అధికారులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. కృష్ణ సాయి ఎన్‌క్లేవ్ కాలనీ ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, త‌మ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణన‌లోకి తీసుకొని ప్రత్యేక చొరవతో భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. డ్రైనేజీ సమస్య ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ విజకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు లింగయ, శ్రీను, ప్రతాప్ రెడ్డి, కృష్ణ సాయి ఎన్‌క్లేవ్ కాలనీ వాసులు విజయ్ కుమార్, కృష్ణ చారి, సోమి రెడ్డి, వీరేందర్, సురేందర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here