శేరిలింగంపల్లి, మార్చి 26 (నమస్తే శేరిలింగంపల్లి): దౌల్తాబాద్‌కు నూతన సర్పంచ్‌గా ఎన్నికైన వావిలాల సంగీత నరసింహ యాదవ్ ని యాదవ సంఘం తరఫున ఘనంగా సత్కరించారు. సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు పెరుగు ఐలేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు పెరుగు రమేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షుడు పి.గణేష్ యాదవ్, రామచంద్రాపురం అధ్యక్షుడు లకడారం మల్లేష్ యాదవ్, ఒగ్గు కృష్ణ యాదవ్, శంకర్ ముదిరాజ్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.






