శేరిలింగంపల్లి, మార్చి 25 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నల్లగండ్ల హుడా కాలనీలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. వీధి దీపాల ఏర్పాటు ద్వారా కాలనీ వాసులకు, రోడ్డుపై వెళ్లే వాహనాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






