శేరిలింగంపల్లి, మార్చి 25 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్ కాలనీలో దోమలు, క్రిమి కీటకాల నివారణకు జిహెచ్ఎంసి సిబ్బంది, ఎంటమాలజీ సహకారంతో కాలనీలో చర్యలు చేపట్టారు. కాలనీలో దోమల నివారణ చర్యలను అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పర్యవేక్షించారు. కాలనీలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు, చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ బయట పారేయకుండా, జిహెచ్ఎంసి చెత్త బండికే ఇవ్వాలని ప్రజలకు అవగాహన కలిగించారు. చెత్తను బయట ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల దోమలు, ఈగలు విపరీతంగా ప్రబలుతాయని, దోమ కాటు వల్ల మలేరియా, డెంగీ విష జ్వరాలు ప్రబలుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.






