శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో ముస్లింలు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్ కి చెందిన ముస్లింలు ఈ సందర్భంగా గాంధీకి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.






