యువ‌త క్రీడ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చాలి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, మార్చి 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమని, యువత క్రీడల్లో ప్రతిభ కనబరచాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మియాపూర్ మెట్రో గ్రౌండ్‌లో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు ఫౌండర్, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్న‌మెంట్‌ను జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌గదీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ యువ‌త క్రీడ‌ల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాల‌ని అన్నారు. య‌ల‌మంచి ఉద‌య్‌ కిర‌ణ్ మాట్లాడుతూ శుక్ర‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కు ఈ టోర్న‌మెంట్ నిర్వ‌హించ‌డం జరుగుతుంద‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు వీరేందర్ గౌడ్, కావూరి ప్రసాద్, పట్వారీ శశిధర్, కట్ల శేఖర్ రెడ్డి, రాజధర్మ రెడ్డి, రాజి రెడ్డి, బిఎస్ఎన్ సాయి, రాంచందర్ గౌడ్, వాసు, సంగమేష్, రమేష్, శ్రీనివాస్ ముదిరాజ్, బాలింగ్ సురేష్ గౌడ్, సాయి యాదవ్, ప్రియదర్శిని, దివాకర్ రెడ్డి, రవి కుమార్, రత్నాచారి, శరత్, రాధాకృష్ణ, ప్రవీణ్, సతీష్, కామినేని వాసు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here