శేరిలింగంపల్లి, మార్చి 20 (నమస్తే శేరిలింగంపల్లి): అహింస బలహీనత కాదు, అది అత్యున్నతమైన శక్తి, ఈ మహత్తర విలువను జైన సమాజం అద్భుతంగా ఆచరిస్తోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. నల్లగండ్ల డివిజన్లోని నల్లగండ్ల హుడా ప్రాంతంలో నిర్మించిన శ్రీ దిగంబర్ జైన్ జినాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జైన సమాజ సభ్యులు, స్థానిక కాలనీ ప్రజలతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.






