శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న గాంధీ శిల్ప బజార్ హస్తకళాకారుల ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సోమవారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మీనాక్షి కూచిపూడి కళా నిలయం గురువు మీనాక్షి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణపతి కౌతం, పుష్పాంజలి, పలుకే బంగారమాయె, బ్రహ్మాంజలి, ఇదిగో భద్రాద్రి, ఇట్టి ముద్దులాడి బాలుడు, నాగేంద్ర హారయా, చక్కని తల్లికి, అదిగో అల్లదిగో, నారాయణతే, అష్టలక్ష్మి , గరుడ గమన, లలిత హారతి అంశాలను సాత్విక, హిమాన్య, అనూష, అక్షర, నిహారిక, తమోగుణ, దర్శిని, సహస్ర , చిన్మయి, భవ్య, హారాణిక, భారతి ప్రదర్శించి మెప్పించారు.






