శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని ఉమ్మడి హఫీజ్ పేట డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఉమ్మడి హఫీజ్‌పేట డివిజన్లో ప్రస్తుతం మదీనగూడ, హఫీజ్ పేట డివిజన్లు ఉన్న నేపథ్యంలో డివిజన్లలో నెలకొన్న ప్రజాసమస్యలపై వారు చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన పాదయాత్రపై కూడా వారు చర్చించారు.






