చందానగర్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం… దగ్ధమైన అను ఫర్నిచర్ షోరూం…

శేరిలింగంప‌ల్లి, మార్చి 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక అను ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూం లో భారీ మంటలు చెలరెగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్టు షోరూం యజమాని రమణారెడ్డి తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ భోజనానికి వెళ్ళి వచ్చేలోపు పొగలు వస్తుండటం గమనించాడని, షట్టర్ తెరిచేలోపు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని తెలిపారు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో ఏలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన సదరు భవనం స్థానిక మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ కు చెందినది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here