తారానగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

శేరిలింగంప‌ల్లి, మార్చి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తారానగర్ లోని విద్యానికేతన్ మోడల్ హైస్కూల్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, MVR గ్రూపు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలోని 40 కాలనీలలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలైన మహిళలకు బహుమతి ప్రదానోత్సవం నిర్వ‌హించారు. 90 మంది స్థానిక మహిళా నాయకురాళ్ళకు స‌న్మానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి, MVR గ్రూపు చైర్మ‌న్ మూల‌ వెంకటేష్ గౌడ్ హాజ‌రై విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలోని మహిళా గ్రూపుల మహిళలు భారతీయ సంస్కృతి పరిరక్షకులని, వారిలోని కళాత్మక జీవన విధానం ఒక క్రమపద్ధతిలో కొనసాగుతుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి విజయజ్యోతి, మహిళా నాయకురాళ్ళు మాజీ కౌన్సిల‌ర్‌ నాగమణి, వాణీ సాంబశివరావు, విజయలక్ష్మి, కుమారి, రాణి యాదవ్, జ్యోతి, లక్ష్మి, వరలక్ష్మి, తన్వీర్ బేగం, నజీరా, చంద్రకళ, వాణి, మెర్సీ, శ్రీ చందన, రోజీ, కుర్రా ధనలక్ష్మి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, జనార్ధన్, G.V. రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here