సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం: ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మార్చి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ నివాసంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మియాపూర్ డివిజన్‌కు చెందిన పలువురు మహిళలను ఆహ్వానించి ఉప్పలపాటి సుమలతతో కలసి శాలువాలతో సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, కుటుంబం నుండి సమాజం వరకు ప్రతి రంగంలో మహిళలు విశేష సేవలందిస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి మూలం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్‌కు చెందిన మహిళలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here