శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ ఫ్రెండ్స్ కాలనీ కాన్ఫిడెంట్ ప్రైడ్ క్లబ్ హౌస్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 108 లక్ష్మీ దీపోత్సవ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. మంజుల రఘునాథ్ రెడ్డి దీపప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళల ఐక్యత సమాజానికి బలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, వాసవి క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






