సేవాలాల్ భవన నిర్మాణానికి రూ.2.50 లక్షల విరాళం అందజేత

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లిలో సేవలాల్ భవన నిర్మాణానికి రూ.2.50 ల‌క్ష‌ల‌ను బీఆర్ఎస్ యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ విరాళంగా అందించారు. ఈ చెక్కును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేతుల మీదుగా సేవాలాల్ కమిటీ ప్రతినిధి శ్రీనివాస్ నాయక్ కి అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేవాలాల్ కమిటీ తరఫున భవన నిర్మాణం కోసం కృషి చేస్తున్న శ్రీనివాస్ నాయక్ సేవలను ప్రశంసిస్తూ, సమాజాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. అలాగే యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ సామాజిక బాధ్యతాభావం, సేవా దృక్పథం, నిబద్ధతను అభినందిస్తూ, ఇలాంటి యువతే పార్టీకి, సమాజానికి భవిష్యత్ బలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతా రెడ్డి, సేవాలాల్ కమిటీ సభ్యులు సుభాష్ నాయక్, గోపాల్ నాయక్, సురేష్ నాయక్, బాష్య నాయక్, రమేష్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here