బీసీ సింహ గర్జన సభ విజయవంతం: బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వరి 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బి సి వై రాజకీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధనకు, రాజ్యాధికార సాధనకు విజయవాడలో జరిగిన సింహ గర్జన బహిరంగ సభకు రెండు రాష్ట్రాల బీసీ కులాల సంఘాల చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌లో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల‌కు చెందిన బీసీలు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ మాట్లాడుతూ బీసీల కోసం పోరాడుతున్న, బీసీల హక్కుల కోసం బీసీలను ముందుండి నడిపిస్తున్న వ్యక్తి బోడె రామచంద్రయ్య అని అన్నారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ విజయవాడలో జరిగిన ఈ సింహగర్జన మహా సమావేశానికి తాను రావడం త‌న‌ అదృష్టంగా భావిస్తున్నాన‌ని, బీసీ కులాల సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధికారం హ‌స్త‌గ‌తం కావ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ , తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షుడు కొంటు ముకుందం , యువజన నాయకులు కొంటు సుమన్ , బిసి ఐక్యవేదిక మేడ్చల్ అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్, రాజేందర్ , బీసీవై పార్టీ ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, మాదాపూర్ యాదవ్ సంఘం ఎర్రగుడ్ల వెంకటేష్ యాదవ్, ఎర్రగుండ్ల డాక్టర్ సాయి యాదవ్, బీసీ రాష్ట్ర నాయకులు పాములేటి యాదవ్, పల్నాడు యాదవ్, నాయకుడు వెంకటేష్ యాదవ్, కెపిహెచ్బి కాలనీ యాదవ సంఘం నాయకుడు రమణా యాదవ్, వికారాబాద్ శంకర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా కృష్ణ యాదవ్, సిద్దిపేట జిల్లా కుమార్ గౌడ్, వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం అశోక్ నేత, మెదక్ జిల్లా వెంకటేష్ గౌడ్, సంగారెడ్డి జిల్లా విశ్వకర్మ సంఘం మనోజ్, కరీంనగర్ జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం రాజు, నల్లగొండ జిల్లా రజక సంఘం నాయకుడు ప్రవీణ్, బీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిరిపు హరి కృష్ణ చారి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here