శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ లో రామాలయం లోని శివాలయంలో మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించి పరమేశ్వరుడికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినం అని, శివుడికి అత్యంత ఇష్టమైన రోజు అని అన్నారు. శివరాత్రి నాడు వాడ వాడలా రోజు వారీ ఉపవాస దీక్షలతో , జాగారంతో వేడుక చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






