ఆదిత్య నగర్ కాలనీ లో సివ‌రేజ్ లైన్ పనులు ప్రారంభం

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ లో రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సివ‌రేజ్ లైన్ పనులను జలమండలి అధికారులు, కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పాత లైన్ చిన్నది అయ్యి నూతనంగా ఇల్లు నిర్మాణాలు అవ్వటం వలన సివ‌రేజ్ లైన్ పెంచటం అనివార్యం అయ్యి నూతనంగా సెవెరేజ్ లైన్ ను PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఏ చిన్న సమస్య అయిన త‌న‌ దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తాన‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here