శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని అమ్మవారికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ కి అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రశాదాలు అందజేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తుల్జా భవాని అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తుల్జా భవాని టెంపుల్ ఛైర్మన్ బీకే రాజశేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పవన్, సత్యనారాయణ, శ్రీనాథ్, శిరీష, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మి నారాయణ గౌడ్, వార్డు మెంబర్ కవిత గోపికృష్ణ, కే రాంచందర్, జనార్దన్ రెడ్డి, పవన్ కుమార్, గోవింద్ చారీ, నటరాజ్, విజయ్, పాండు, బీమన్ శ్రీను, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.






