మాన‌సిక ఒత్తిడిని అధిగ‌మించేందుకు ఆట‌లు అవ‌స‌రం: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దీప్తి శ్రీనగర్ స్పోర్ట్స్ క్లబ్ లో నిర్వహించిన ఇండోర్ గేమ్స్ లో గెలుపొందిన విజేతలకు బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ బహుమతులు అందజేశారు. చందా నగర్ డివిజన్, దీప్తి శ్రీ నగర్ పార్క్ వద్ద ఉన్న బాడ్మింటన్ గ్రౌండ్‌లో దీప్తి శ్రీ నగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026, బాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ లో నిర్వాహకుల ఆహ్వానం మేరకు పాల్గొని ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ఈ సందర్భంగా బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. అనంత‌రం మాట్లాడుతూ మన జీవితంలో సంపాదన, గౌరవం, క్రమ శిక్షణ ఎంత అవసరమో ఆటలు ఆరోగ్యం , మానసిక ఒత్తిడిని అధిగమించడం అంతే అవసరం. ఆటలు ఆడటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, పోరాడాలి , ప్రయత్నించాలి అనే సంకల్పం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, క్రీడల వల్ల మనం జీవితం పాఠాలు ఎన్నో నేర్చుకోవచ్చు, జీవితం కూడా ఆట లాగే గెలవడం ఉండటం మన చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రాఘవేంద్ర రావు, నాగేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ రావు, శేఖర్, ఓం ప్రకాష్, శ్రీరామ్, దుర్గా ప్రసాద్, అశోక్, భగవాన్, సత్య నారాయణ, నాయకులు మాణిక్ రావు, ఆకుల లక్ష్మణ్, గణేష్, శ్రీనివాస్, విజయేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here