శేరిలింగంపల్లి, జనవరి 25 (నమస్తే శేరిలింగంపల్లి): సామాజిక ఆరోగ్య పరిరక్షణలో భాగంగా, దోమల నివారణ చర్యలకై చందానగర్ డివిజన్లో ఫాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, మిరియాల రాఘవరావు చేతుల మీదుగా ప్రారంభించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో, ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన దోమల నివారణ వాహనాలను ప్రారంభించి, డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీ, కాలనీలో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం, భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. ప్రజలను దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరియాల రాఘవరావు, విష్ణుమూర్తి, వెంకటేశ్వరరావు, కృష్ణ, రంగారావు, యాదయ్య, పల్లని స్వామి, ఆంజనేయులు, శివకుమార్, రమణ, చలం, చందానగర్ డివిజన్‌కు చెందిన కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





