శిల్పారామంలో అల‌రించిన సాంస్కృతిక కార్యక్రమాలు

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా వైదేహి సుభాష్ శిష్య‌ బృందం ప్రాణ్యసాత్విక, మణిప్రసాద్ తమ భరతనాట్య ప్రదర్శనలో సకలగణాధి, శివ పంచాక్షరీ, పదం తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. కుమారి గరిమెళ్ళ నాగ లక్ష్మి సాహితి , ఆంగికం స్కూల్ అఫ్ డాన్స్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, శ్లోకముల, శ్రీ విజ్ఞారాజం భజే, రంగాపురం విహార, కళ్యాణ రామ , ఆండాళ్ కౌతం, గరుడ గమన, బృందావని తిల్లాన, నర్సింహా కౌతం శ్రీ రామ చంద్రునకు అంశాలను గరిమెళ్ళ నాగ లక్ష్మి సాహితి, వినూత్న, రుత్విక, ఆద్య, అక్షర భార్గవి, ఆరాధ్య, శశి, మోక్ష లు ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here