శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం విద్యుత్ విభాగం అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు, విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. ఈ 2026 ఆంగ్ల నూతనసంవత్సర కాలంలో ప్రజలు నిత్యనూతన ఉత్సాహంతో, చిరునవ్వుతో ఉండాలని , జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.






