భారతి మహిళా మండలి  ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్క‌రించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హుడా కాలనీ భారతి మహిళా మండలి  ఆధ్వర్యంలో సంతోషి మాత గుడి దగ్గర, దీప్తిశ్రీ నగర్ లో  ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ లు బహుమతుల‌ను ప్రదానం చేశారు. ఈ పోటీలలో విజయలక్ష్మి, రమ్య విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీలలో 25 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాలు అనసూయ , కృష్ణకుమారి , రాధారాణి, స్వయంప్రభ, హేమలత,  ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, వాణి సాంబశివరావు, శాంతకుమార్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here