పీజేఆర్‌కు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 28 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): కార్మిక నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, సీఎల్పీ నాయకుడు పి జనార్దన్ రెడ్డి 18 వ వర్థంతి సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ కాలనీ లో ఆయ‌న‌ విగ్రహానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కార్మిక లోక బాంధవుడు, స్వర్గీయ పిజేఆర్ భౌతికంగా మనకు దూరమైనా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని అన్నారు. పిజెఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కార్మిక నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అని, సీఎల్పీ నాయకుడిగా పనిచేశారని, ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనునిత్యం ప్రజల కోసం పరితపించే ప్రజా నాయకుడు పిజెఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు , మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్‌లో..

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ కాలనీ లో పీజేఆర్ విగ్రహానికి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు , మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here