శేరిలింగంపల్లి, డిసెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): క్రిస్మస్ పండుగ సందర్బంగా ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి వారి కార్యాలయంలో డివిజన్లో ఉన్న సుమారు 60 మంది పాస్టర్ల కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు అందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణ లతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ లోని పాస్టర్లు అందరూ ఎంతో ప్రేమ చూపిస్తూ తమకోసం, తమ కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారని గుర్తుచేశారు. డివిజన్ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి, మోజెస్, పాస్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






