తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీకి ఒక్క అవ‌కాశం ఇవ్వాలి: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మహిళలు, విద్యార్థులు, యువత , రైతులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, అన్ని వర్గాల ప్రజలకు హస్తం సర్కార్ మొండి చేయి చూపిస్తుంద‌ని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అభివృధి శూన్యమ‌ని, ఇచ్చిన హామీలు మరిచిపోయార‌ని, పాలన గాలికి వదిలేశార‌ని, సామాన్యుడిని రోడ్డుపైకి తీసుకొచ్చార‌ని, రాష్ట్రాభివృద్ధిని పాతాళానికి తొక్కేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజా వంచక పాలనపై నిరసనగా ఇందిరాపార్క్, ధర్నాచౌక్ వద్ద నిర్వహించబోయే మహాధర్నా కార్యక్రమానికి భారీసంఖ్యలో శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు త‌ర‌లివెళ్లారు. కొండాపూర్‌లోని మసీద్ బండ బీజేపీ కార్యాలయానికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలతో రవికుమార్ యాదవ్ బయలుదేరి వెళ్ళి మహాధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ 6 అబద్ధాలు , 66 మోసాలతో గెలిచిన కాంగ్రెస్ పాలనలో అభివృధి శూన్యమని, ఇచ్చిన హామీలు మరిచి, పాలన గాలికి వదిలేసి, సామాన్యుడిని రోడ్డుపైకి తీసుకొచ్చి, రాష్ట్రాభివృద్ధిని పాతాళానికి తొక్కేస్తున్నారన్నారు. హైడ్రా పేరుతో భయబ్రాంతులకు గురి చేసి, డబ్బులు వసులు చేస్తున్నారని, హెచ్.సి.యు ల్యాండ్స్ కబ్జాకు ప్రభుత్వమే ప్రయత్నించడం దారణమన్నారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు రూ.25 వేల పింఛను, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఒక్కరికైనా ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి, 250 గజాల ఇళ్ల స్థలం పంపిణీ చేస్తామన్నారని, క‌నీసం ఒక్కరికైనా ఇచ్చారా అని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారని, 46 జీవో అమలుచేసి ఉన్న 23 శాతం పోయి 17 శాతానికి వచ్చేలా చేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గత ప‌దేళ్లుగా ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. ఎన్నో రకాలుగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వమున్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తూనే ఉందన్నారు. రాబోయే తరాల భవిషత్తు కోసం ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here